అటవీ అధికారులు మోసం చేశారు
ABN , First Publish Date - 2021-02-08T09:38:56+05:30 IST
తమ పోడు భూముల్లో కాలువ పనులు చేపట్టకుండా ఉండేందుకు అటవీ శాఖ అధికారులు తమ వద్ద డబ్బులు వసూలుచేసి చివరికి తమపైనే కేసులు పెట్టి మోసం చేశారని
డబ్బు తీసుకుని మాపైనే కేసులు పెట్టారు.. గిరిజన రైతుల ఆరోపణ
ఇల్లెందు రూరల్, జనవరి 7: తమ పోడు భూముల్లో కాలువ పనులు చేపట్టకుండా ఉండేందుకు అటవీ శాఖ అధికారులు తమ వద్ద డబ్బులు వసూలుచేసి చివరికి తమపైనే కేసులు పెట్టి మోసం చేశారని భద్రాచలం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం గిరిజన రైతులు ఆరోపించారు. తమ దగ్గరి నుంచి కొమరారం ప్రాంతానికి చెందిన అటవీ సెక్షన్ అధికారి, బీట్ అధికారి రూ.3 లక్షలకు పైగా తీసుకున్నారని కొమరారం, కొరంగుంపు, చింతలగుంపునకు చెందిన 33 మంది రైతులు ఆరోపించారు. పైగా తమ భూముల్లో కాలువ పనులు చేపడుతుంటే వారిని ప్రశ్నించినందుకు తమపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నా తమ భూములకు పట్టాలు ఇవ్వకుండా కొన్నేళ్లుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఆ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కొమరారం అటవీ సెక్షన్ అధికారి సుక్కిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా తాము ఎవరి దగ్గరి నుంచీ డబ్బు తీసుకోలేదన్నారు.