హఫీజ్‌పేట్ భూములు ప్రైవేట్‌వే.. హైకోర్టు సంచలన తీర్పు
ABN , First Publish Date - 2021-03-31T01:59:51+05:30 IST
హఫీజ్‌పేట్ భూములు ప్రైవేట్‌వే.. హైకోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్: హఫీజ్‌పేట్ సర్వే నంబరు 80లోని భూములపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. సర్వే నెంబరు 80లోని 140 ఎకరాలు వక్ఫ్, ప్రభుత్వ భూమి కాదని తేల్చింది. సర్వే నెంబరు 80లోని భూమి ప్రైవేట్‌దేనని తెలిపింది. పిటిషనర్లకు రూ.4 లక్షలు చెల్లించాలని వక్ఫ్ బోర్డు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 50 ఎకరాలు ప్రవీణ్ రావు సహా యజమానుల పేరిట నమోదు చేయాలని సూచించింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హఫీజ్‌పేట్ భూవివాదంలోనే ప్రవీణ్ రావు కిడ్నాప్ అభియోగంపై ఇటీవల అఖిలప్రియ సహా పలువురిని అరెస్టు చేశారు.