జడ్పీటీసీ, ఎంపీటీసీలకు పెరిగిన వేతనం

ABN , First Publish Date - 2021-09-29T09:15:43+05:30 IST

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనాలు పెరిగాయి.

జడ్పీటీసీ, ఎంపీటీసీలకు పెరిగిన వేతనం

  • ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్న హరీశ్‌
  • సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనాలు పెరిగాయి. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 30ు గౌరవ వేతనాలను పెంచుతామని సీఎం గతంలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వేతనాల పెంపు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. ప్రజాప్రతినిధుల గౌరవవేతనాన్ని పెంచిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత ట్విటర్‌ వేదికగా ఽకృతజ్ఞతలు తెలిపారు. తాజా ఉత్తర్వులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచుల తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్‌ తెలిపారు. కాగా, ఇదంతా ప్రచారం కోసమే అని పంచాయతీరాజ్‌ చాంబర్‌ ప్రతినిధి, జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు.  

Updated Date - 2021-09-29T09:15:43+05:30 IST