Hyderabad: నిండుతున్న జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు
ABN , First Publish Date - 2021-07-18T16:57:32+05:30 IST
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఫాక్స్‌సాగర్ నిండుతోంది. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షానికి 3 నెలల పాటు నీటిలోనే ఉమామహేశ్వరకాలనీ
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఫాక్స్‌సాగర్ నిండుతోంది. గత అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షానికి 3 నెలల పాటు నీటిలోనే ఉమామహేశ్వరకాలనీ ఉండిపోయింది. ఫాక్స్ సాగర్ చెరువు నిండుతుండటంతో చెరువు కింద ఉన్న సుభాష్ నగర్, జీడిమెట్ల, షాపూర్ నగర్ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కట్టను ఆనుకొని ఉన్న చిన్న పరిశ్రమలు, ఓ గుర్రాల షెడ్డు పూర్తిగా నీట మునిగాయి. ఇక్కడ బస్టాండ్ ప్రాంతంలో దాదాపు 40 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నాయి. దీంతో రాత్రి నుంచి కంటి మీద కునుకు లేదని.. పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు. గత అయిదు రోజులుగా కురుస్తున్న వానలకు శుక్రవారం రాత్రికి ఈ నీటిమట్టం 26 అడుగులకు చేరింది. ఇది ఇంకొంచెం పెరిగితే కిందనున్న ప్రాంతాలతో పాటు మరోసారి ఉమామహేశ్వర కాలనీకి ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.