భద్రాద్రి కొత్తగూడెం: జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు కరోనా
ABN , First Publish Date - 2021-07-16T15:46:45+05:30 IST
జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యింది.
భద్రాద్రి కొత్తగూడెం: జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యింది. హరితహారంలో భాగంగా మంత్రులతో పాటు పలు ప్రారంభోత్సవాలకు కనకయ్య హాజరయ్యారు. కరోనా లక్షణాలు దగ్గు, జ్వరం, జలుబు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో తనతో పాటు తిరిగిన నాయకులు, కార్యకర్తలు కూడా టెస్ట్ చేయించుకోవాలని కనకయ్య సూచించారు.