Bhadradriలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు
ABN , First Publish Date - 2021-12-19T14:02:58+05:30 IST
జిల్లాలోని చర్ల మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీల పేరుతో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని చర్ల మండలంలోని పలు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీల పేరుతో కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ‘‘మావోయిస్టులు చేస్తున్న ఉద్యమం మా ఆదివాసీల అభివృద్ధి కోసమా, ఎక్కడ మా ఆదివాసీల అభివృద్ధి. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి’’ అంటూ ఆదివాసీల పేరుతో కరపత్రాలు వెలిశాయి.