పాఠశాల స్థలంలో బాణసంచా దుకాణాలు
ABN , First Publish Date - 2021-11-03T04:33:47+05:30 IST
దీపావళి బాణాసంచా దుకాణాలు సింగరేణి పాఠశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేయ డం పలు విమర్శలకు దారితీస్తోంది.
ఒక్కో దుకాణానికి రూ.30 వేల చొప్పున ముడుపులు..?.. 25 షాపుల ఏర్పాటు
ఇల్లెందుటౌన్, నవంబరు 2: దీపావళి బాణాసంచా దుకాణాలు సింగరేణి పాఠశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేయ డం పలు విమర్శలకు దారితీస్తోంది. జనసంచారానికి దూ రంగా ఏర్పాటుచేయాల్సిన దుకాణాలు పాఠశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేయడంతో విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. నిబందనలకు విరుద్దంగా పాఠశాల గ్రౌండ్‌లో బాణాసంచా దుకాణలకు ఏర్పాటు కోసం వివిధ శాఖల అధికారులకు ముడుపులు బారీగానే మట్టజెప్పినట్లు జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఇల్లెందులో ఇప్పటికే 25దుకాణాలు ఏర్పా టు చేయగా అనుమతులకోసం రెవెన్యూ, పోలీస్, ఫైర్, మునిసిపాలిటి తదితర శాఖలకు ఒక్కో దుకాణానికి రూ 30వేల చొప్పున ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నా యి. అంతేకాకుండా బాణాసంచా ధరలు కూడా విపరీ తంగా పెంచి అమ్మకాలు చేసేందుకు రంగం సిద్దం చేశా రు. సింగరేణి పాఠశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసేందుకు సిం గరేణికి ఒక్కో దుకాణానికి రూ.5వేల చోప్పున 1.50లక్షలు గ్రౌండ్ కిరాయి చెల్లించారు. దుకాణాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లిస్తున్న దుకాణాల దారులు ధర లు పెంచి అమ్మకాలు చేసేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ముడుపుల భారం కొనుగోలుదారులపై పడనుందని వాపోతున్నారు.