మేజర్‌ కాల్వలకు నీరందడంలేదు

ABN , First Publish Date - 2021-12-19T05:52:02+05:30 IST

మేజర్ల కాల్వలకు నీరందకపోవడంతో మిర్చి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహంతో శనివారం మండలంలోని గుబ్బగుర్తి సెంటర్‌లో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

మేజర్‌ కాల్వలకు నీరందడంలేదు
గుబ్బగుర్తి సెంటర్‌లో సాగర్‌జలాలు కోసం ఆందోళన చేస్తున్న రైతులు

రోడ్డెక్కిన అన్నదాతలు

ఎన్నెస్పీ అధికారుల హామీతో ఆందోళన విరమణ

కొణిజర్ల, డిసెంబరు 18: మేజర్ల కాల్వలకు నీరందకపోవడంతో మిర్చి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహంతో శనివారం మండలంలోని గుబ్బగుర్తి సెంటర్‌లో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రధానకాల్వ నుంచి తమ మేజర్లకు నీరందేవరకు ఆందోళన విరమించేదిలేదని బీస్మించారు. గుబ్బగుర్తి మేజర్‌కాల్వతో పాటు సింగరాయపాలెం, గద్దలగూడెం తదితర మేజర్లకు నీరందటంలేదని రైతులు పేర్కొన్నారు. గుబ్బగుర్తి, రాంపురం రైతులు ఆవేదన రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఎన్నెస్పీ అధికారులు ఏమాత్రం పట్టించుకోరని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజు, సిబ్బందితో ఆందోళన వద్దకు చేరుకున్నారు. ఎన్నెస్పీ అధికారులు నీటిని మేజర్లకు అందిస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించమని రైతులు తెలిపారు. ఎస్‌ఐ వై.రాజు చొరవ తీసుకొని రైతుల విజ్ణప్తి మేరకు ఎన్నెస్పీ అధికారులతో మాట్లాడారు. అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ఎన్డీ నాయకులు పాశం అప్పారావు, షేక్‌ ఖాసీం, అర్జున్‌రావు, సీపీఎం నాయకుడు జట్ల రవి, కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు సూరంపల్లి రామారావు, రాందా్‌సనాయక్‌, దొడ్డపునేని వెంకటేశ్వర్లు మద్దతుగా నిలిచారు. 


Updated Date - 2021-12-19T05:52:02+05:30 IST