అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ గేటుకు తాళం

ABN , First Publish Date - 2021-07-18T05:30:00+05:30 IST

పామాయిల్‌ గెలలు దిగుమతులు అలస్యమవుతున్నాయన్న కారణంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రాత్రి 10.30 సమయంలో అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.

అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ గేటుకు తాళం
అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ ఎదుట రైతుల ఆందోళన

గెలలు దిగుమతి చేసుకోకపోవడంతో రైతుల ఆగ్రహం

దమ్మపేట, జూలై 18: పామాయిల్‌ గెలలు దిగుమతులు అలస్యమవుతున్నాయన్న కారణంతో ఆగ్రహించిన రైతులు ఆదివారం రాత్రి 10.30 సమయంలో అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీ గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రా నుంచి లారిలో వచ్చిన పామాయిల్‌ గెలలు దిగుమతులు చేస్తున్నారని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న స్థానిక రైతుల గెలలు దిగుతులు కావటం లేదంటూ ఫ్యాక్టరీ సిబ్బందిని నిలదీశారు. ఈవిషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్‌ రావు జోగేశ్వరరావు, డైరెక్టర్‌ కోటగిరి పుల్లయ్య బాబు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. దీంతో స్పందించిన ఫ్యాక్టరీ సిబ్బంది గెలుల ఎక్కువగా రావటం వల్ల సమస్య వచ్చిందని వెంటనె దిగుమతి చేసి పంపుతామని హామీ ఇవ్వడంతో రైతులు గేట్లు తెరిచారు. దీనిపై మేనేజర్‌ శ్రీకాంతరెడ్డిని వవరణ కోరగా ఫ్యాక్టరీకి అధికంగా గెలలు రావడం వల్లె సమస్య తలెత్తిందన్నారు. తెలంగాణ సరిహద్దులో సోమవారం నుంచి చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు.


Updated Date - 2021-07-18T05:30:00+05:30 IST