పామాయిల్ సాగు విస్తరణకు సర్కారు చర్యలు
ABN , First Publish Date - 2021-01-09T04:58:27+05:30 IST
రాష్ట్రప్రభుత్వం పామాయిల్ సాగును విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు, అధికారుల పర్యటన
రైతులతో కలిసి ఆయిల్‌పాం తోటల పరిశీలన
దమ్మపేట, జనవరి 8: రాష్ట్రప్రభుత్వం పామాయిల్ సాగును విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎనిమిది లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటల పెంపకానికి రైతులకు రుణసౌకర్యం కల్పించేందుకు గానూ క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు బ్యాంకు, ఉద్యానశాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం అశ్వారావుపేట, దమ్మపేట మండలోని మల్కారం పరిధిలోని పామాయిల్ తోటలను పరిశీలించారు. ఈసందర్భంగా పలువురు రైతులను వివరాలు అడిగి తెలుసుకు న్నారు. పామాయిల్ రైతులు అంకత మహేశ్వరరావు, ఆలపాటి రాంచంద్రప్రసాద్ మాట్లాడుతూ రైతులకు రుణాలు, రాయితీలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు వి.సరోజినిదేవి, లహరి, సహయ సంచాలకులు కొండా లక్ష్మణ్, శాస్త్రవేత్త విజయకృష్ణ, బ్యాంక్ అధికారులు ఓబుల్‌రెడ్డి ఎస్ బీఐ ఏజీఎం సంతానం, నాబార్డు, కెనరా, సెంట్రల్, యానియన్, పంజాబ్ నేషనల్, రాష్ట్ర సహకార, గ్రామీణబ్యాంకు అధికారులు పాల్గొన్నారు.