అల్లు అర్జున్‌ కారవ్యాన్‌ను ఢీకొన్న లారీ

ABN , First Publish Date - 2021-02-07T09:19:55+05:30 IST

నటుడు అల్లు అర్జున్‌ కారవ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం సత్యనారాయణ పురం వద్ద శనివారం

అల్లు అర్జున్‌ కారవ్యాన్‌ను ఢీకొన్న లారీ

ఖమ్మం రూరల్‌, ఫిబ్రవరి 6: నటుడు అల్లు అర్జున్‌ కారవ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఖమ్మం జిల్లా రూరల్‌ మండలం సత్యనారాయణ పురం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారవ్యాన్‌ బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా మారేడు మిల్లులో ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ ముగించుకుని అల్లు అర్జున్‌ విమానంలో హైదరాబాద్‌కు వెళ్లగా ఆయన కారవ్యాన్‌ ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ఖమ్మం నగరం సమీపంలోని సత్యనారాయణపురం వద్దకు రాగానే వెనుక నుంచి ఓ లారీ ఆ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది.

Updated Date - 2021-02-07T09:19:55+05:30 IST