ఊరూరా మార్కండేయ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-02-15T04:28:47+05:30 IST

ఊరూరా మార్కండేయ జయంతి వేడుకలు

ఊరూరా మార్కండేయ జయంతి వేడుకలు
పరకాలలో పూజలు చేస్తున్న ట్రస్టు సభ్యులు

పరకాల, ఫిబ్రవరి14: పద్మశాలి కులస్థుల ఆరాధ్యదైవం మహర్షి మార్కండేయ జయంతిని పద్మశాలి ట్రస్టుబోర్డు ఆధ్వర్యంలో ఆదివారం పరకాలలో నిర్వహించుకున్నారు. ట్రస్టు అధ్యక్షుడు చెనుమళ్ల వెంకటరాజ్యం ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్‌ రాజేశ్వరప్రసాద్‌, మెరుగు శ్రీనివాస్‌, కుమారస్వామి తదితరులు ఉన్నారు.

శాయంపేట: మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో, పద్మశాలి యువసేన ఆధ్వర్యంలో భక్త మార్కండేయుడిని పురవీధుల్లో ట్రాక్టర్‌పై మొగ్గం నేస్తు శోభాయాత్ర నిర్వహించారు. కార్య క్రమంలో సర్పంచ్‌ కె.రవి, చేనేత సొసైటీ పీఐసీ చెర్మన్‌ ఎం.శంకర్‌ లింగం, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శరత్‌, పద్మశాలి యువసేన అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌ తదితరులు పాలొన్నారు. 

నెక్కొండ : నెక్కొంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మండల పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం మండల, పట్టణ అధ్యక్షుడు కె.చెన్నకేశవులు, ఆర్‌.కట్టయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు: మండల కేంద్రంలో మార్కండేయ సేవాసమితి ఆధ్వర్యంలో ఆత్మకూరు పద్మశాలి సమితి భవనంలో జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ఎం.రంజిత్‌, ప్రసాద్‌, రవీందర్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

గీసుగొండ: ధర్మారం రామలింగేశ్వరస్వామి ఆలయంలో మార్కండేయ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు ఎలిగేటి కిష్టయ్య, మల్లయ్య, రామయ్య, వీరస్వామి, శంకర్‌, నర్సయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-15T04:28:47+05:30 IST