త్వరలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు

ABN , First Publish Date - 2021-04-28T05:55:39+05:30 IST

త్వరలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు

త్వరలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
శ్రీపాల్‌రెడ్డిని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 27 : ఎంతో కాలంగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతులను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ప్రోగ్రెసివ్‌ రికగ్నైజ్డ్‌ టీచర్స్‌ యూనియన్‌-తెలంగాణ స్టేట్‌ (పీఆర్టీయూ-టీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నా రు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ను ఒప్పించడంలో తనదైన పాత్ర పోషిం చి తొలిసారి మహబూబాబాద్‌కు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌ రెడ్డిని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంకా బద్రినారాయణ, మిర్యా ల సతీ్‌షరెడ్డి మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను మే నెల వేతనాలతో జమ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా ఉంటుందని, అందులో ఎలాంటి సందేహం వ్యక్తం చేయాల్సిన అవస రం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గీత, రాంజీ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-28T05:55:39+05:30 IST