మేడిగడ్డ బ్యారేజీ 10 గేట్ల ఎత్తివేత

ABN , First Publish Date - 2021-06-18T05:18:03+05:30 IST

మేడిగడ్డ బ్యారేజీ 10 గేట్ల ఎత్తివేత

మేడిగడ్డ బ్యారేజీ 10 గేట్ల ఎత్తివేత

దిగువకు 23,900 క్యూసెక్కులు

 మహదేవపూర్‌ రూరల్‌, జూన్‌ 17 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మండలంలో నిర్మించిన మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పది గేట్లను ఎత్తినట్టు ఇరిగేషన్‌ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు గురువారం తెలిపారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో బ్యారేజీలోకి 51,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  చేరుతుండగా నీటి నిల్వ 11.67 టీఎంసీలకు చేరిందని తెలిపారు.  రెండు రోజులుగా ఇన్‌ఫ్లో పెరుగుతుండగా బ్యారేజీలో ని పదిగేట్లను ఎత్తి దిగువకు 23,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు పే ర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీలో వాటర్‌ లెవల్‌ 98.50మీటర్లు ఉన్నట్టు తెలిపారు.

పెరుగుతున్న గోదావరి 

మహదేవపూర్‌ : ఐదు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాణహిత నదికి క్రమంగా ప్రవాహం ఉధృతమవు తోంది. వరద వస్తుండడంతో ప్రాణహిత సంగమించే కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతోంది.

ఎత్తిపోతలు షురూ.. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మండలంలోని లక్ష్మీపం్‌పహౌజ్‌ నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. బుధవారం రాత్రి నుంచి నీటిని లిఫ్ట్‌ చేస్తున్నారు. పంప్‌హౌజ్‌లోని మూడు మోటార్లను ఆన్‌ చేసి 6,300 క్యూసెక్కుల నీటిని గ్రావిటీ కాల్వ  ద్వారా సరస్వతీ బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నారు. మార్చి 6న మోటార్లను బంద్‌ చేయగా మళ్లీ బుధవారం ఆన్‌ చేశారు.

Updated Date - 2021-06-18T05:18:03+05:30 IST