ఇప్పుడు మనోళ్లే కత్తులతో పొడుస్తున్నారు

ABN , First Publish Date - 2021-09-06T08:51:41+05:30 IST

త్తి ఆంధ్రోళ్లదైతే పొడిచేది తెలంగాణ వాడని ఉద్యమ కాలంలో కేసీఆర్‌ చెప్పేవాడని, ఇప్పుడు కత్తి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులు ఇస్తే.. మనోళ్లే పొడుస్తున్నారని ....

ఇప్పుడు మనోళ్లే కత్తులతో పొడుస్తున్నారు

నాడు ఆంధ్రోళ్లు పొడుస్తున్నారన్నారు..

బీజేపీ కార్యకర్తలను వేధించడం.. ఆపకుంటే హరీశ్‌ భరతం పడతాం:ఈటల రాజేందర్‌

‘కాళేశ్వరం’ కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎం: కేంద్ర మంత్రి మురళీధరన్‌


కమలాపూర్‌/హుజూరాబాద్‌, సెప్టెంబరు 5: కత్తి ఆంధ్రోళ్లదైతే పొడిచేది తెలంగాణ వాడని ఉద్యమ కాలంలో కేసీఆర్‌ చెప్పేవాడని, ఇప్పుడు కత్తి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులు ఇస్తే.. మనోళ్లే పొడుస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తనను విడిచిపోయిన నాయకుల పరిస్థితి అధ్వానంగా ఉందని, దండం దొర అనే బానిసలుగా మారి అవమానాలు పడుతున్నారన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో ఆదివారం జరిగిన గౌడ గర్జన సభలో, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి ఆదేశిస్తే వాటిని మంత్రి హరీశ్‌రావు ఆచరిస్తున్నాడన్నారు. రాత్రి పూట పోలీసుల అండతో హరీశ్‌.. బీజేపీ నాయకుల ఇళ్ల వద్దకు వచ్చి టీఆర్‌ఎ్‌సలోకి రావాలని అడుగుతున్నారని, తమ కార్యకర్తలను వేధించడం ఆపకుంటే మీ భరతం పడతామని హెచ్చరించారు. కేసీఆర్‌ అధికారం 2023 వరకే ఉంటుందన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని కేంద్ర విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ అన్నారు. రూ.40 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు రూ.1.30 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. ఇందులో కేసీఆర్‌ కుటుంబానికి కమీషన్లు అందాయని విమర్శించారు. ‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’ అనేది మోదీ విధానమని, మేరా పరివార్‌ కా వికాస్‌ అనేది కేసీఆర్‌ విధానమని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు. హుజూరాబాద్‌ ఎన్నిక వచ్చింది కాబట్టే ఏడున్నరేళ్ల తర్వాత కేసీఆర్‌కు దళితు లు గుర్తుకు వచ్చారని చెప్పారు. దళితబంధును బీజేపీ స్వాగతిస్తోందని, కానీ దళితులతోపాటు ఇతర కులాల్లో ఉన్న వారికి కూడా రూ.10లక్షలు ఇవ్వాలన్నారు. గౌడ నిరుపేదలకూ గౌడ బంధును ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-09-06T08:51:41+05:30 IST