అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి
ABN , First Publish Date - 2021-09-12T08:27:51+05:30 IST
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ నుంది.
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించ నుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 26వ తేదీన ఐలమ్మ జయంతి, సెప్టెంబరు 10వ తేదీన వర్ధంతి కార్యక్రమాల్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.