రామప్పను సందర్శించిన సినీ నటి పూనమ్ కౌర్
ABN , First Publish Date - 2021-07-25T06:23:59+05:30 IST
రామప్పను సందర్శించిన సినీ నటి పూనమ్ కౌర్
వెంకటాపూర్(రామప్ప), జూలై 24: ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప రామలింగేశ్వర ఆలయాన్ని సినీనటి పూనమ్‌కౌర్ శనివారం సందర్శించారు. తన మిత్ర బృందంతో కలిసి దేవాలయానికి వచ్చిన ఆమెను పూజారులు సాదారంగా ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. రామప్ప శిల్ప కళా సందపను తిలకించిన పూనమ్ మంత్ర ముగ్ధులయ్యారు. ఆలయ విశిష్టతను గైడ్ విజయకుమార్ ద్వారా తెలుసుకున్నారు.