సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-08-24T04:56:57+05:30 IST
సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్
వరంగల్ కలెక్టరేట్, ఆగస్టు 23: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎం.హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. గ్రీవెన్స్‌లో 16 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్‌డీవో పీడీ సంపత్‌రావు, జడ్పీసీఈవో రాజారావు, ఆర్‌డీవో మహేందర్‌జీ, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.