ఉపాధ్యాయుల పోస్టింగ్‌లకు రంగం సిద్దం!

ABN , First Publish Date - 2021-12-31T08:32:03+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీలు. పోస్టింగ్‌లకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. దీంట్లో భాగంగా స్పౌస్‌ కేసులపై వచ్చిన అభ్యంతరాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు.

ఉపాధ్యాయుల పోస్టింగ్‌లకు రంగం సిద్దం!

పూర్తయిన స్పౌస్‌ కేసుల పరిశీలన  

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలు. పోస్టింగ్‌లకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుంది. దీంట్లో భాగంగా స్పౌస్‌ కేసులపై వచ్చిన అభ్యంతరాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. వారు కోరుకున్న జిల్లాలకు బదిలీ చేయడానికి వీలుగా జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ జాబితా ఆధారంగా భార్యాభర్తలకు జిల్లా కేటాయింపులను కూడా పూర్తి చేయనున్నారు. శుక్ర, శనివారాల్లో భార్యా, భర్తలకు జిల్లాల కేటాయింపు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తయిన వెంటనే ఇతర ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. సీనియారిటీ ఆధారంగా ఆయా జిల్లాల వారీగా  ఉపాధ్యాయుల జాబితాలను సిద్ధం చేశారు. కాగా, స్పౌస్‌ కేసుల విషయంలో ఇటీవల తీవ్ర గందరగోళం నెలకొనడం, పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడం, హైకోర్టు ఆదేశాలివ్వడంతో కౌన్సెలింగ్‌ను మధ్యలోనే నిలిపివేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-31T08:32:03+05:30 IST