సెగ్రిగేషన్ షెడ్‌లో ఎరువుల తయారీకి చర్యలు
ABN , First Publish Date - 2021-06-29T04:41:32+05:30 IST
సెగ్రిగేషన్ షెడ్‌లో ఎరువుల తయారీకి చర్యలు
- ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
- బషీరాబాద్: ‘లక్ష్యం.. నిర్లక్ష్యం’ శీర్షికన సెగ్రిగేషన్ షెడ్లపై ‘ఆంధ్రజ్యోతి’ ఎడిషన్‌లో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు బషీరాబాద్ ఎంపీడీవో రమేష్ మాసన్‌పల్లి గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు. గ్రామంలో తడి,పొడి చెత్త సేకరణ చేయించి షెడ్‌లో వేయాల్సిఉండగా ఎందుకు అలా జరుగడంలేదని ఆయన సర్పంచ్ గోళ్ల భీమప్ప, కార్యదర్శి జీవన్‌భాస్కర్‌ను ప్రశ్నించారు. తడిపొడి చెత్త వేర్వేరుగా గదుల్లో వేయించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా సెగ్రిగేషన్ షెడ్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. ఇప్పటికే ఎరువుల తయారికీ వానపాములను షెడ్లలో వదిలిపెట్టడం జరిగిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత కార్యదర్శులపై చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు.