విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-01-03T05:15:52+05:30 IST
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
- టీపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి
- 11న జిల్లా కేంద్రాల్లో ధర్నా
ఆమనగల్లు : విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో తపస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు టీపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి తెలిపారు. ఆమనగల్లులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఉపాధ్యాయులకు 63 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. పదోన్నతులు కల్పించాలని, బదిలీలు, అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని, మహిళా ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల చైల్డ్‌కేర్ సెలవులు ఇవ్వాలని ఆయన కోరారు. సమస్యల పరిష్కారానికి చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈనెల 4న పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన, 6న మండల కేంద్రాల్లో, 8న డివిజన్ కేంద్రాల్లో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ధర్నాకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్, వైస్‌చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్, మాజీ ఎంపీపీ తల్లోజు వెంకటయ్య, తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగర శ్రీనివాస్, కాశీనాథ్‌రావు, జిల్లా మహిళా కన్వీనర్ వనం విజయవర్థిని, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, మహేశ్, విజేందర్ రెడ్డి, సుమరంజిత, విజేందర్ గుప్త, జ్ఞానేశ్వర్, గంగాధర్,మోహన్, యుగేందర్ పాల్గొన్నారు.