‘ఓటుకు నోటు’ పై హైకోర్టులో పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-05-14T00:52:31+05:30 IST

ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టీఫెన్ సన్

‘ఓటుకు నోటు’ పై హైకోర్టులో పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టీఫెన్ సన్, మాల్కం టేలర్ క్రాస్ ఎగ్సామినేషన్ వాయిదా వేయాలని రేవంత్ తన పిటిషన్‌లో కోరారు. దర్యాప్తు అధికారుల ప్రధాన విచారణ ముగిసే వరకూ వాయిదా వేయాలని కోరారు. ఈ అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చడాన్ని రేవంత్ హైకోర్టులో సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 18 కి హైకోర్టు వాయిదా వేసింది. 


Updated Date - 2021-05-14T00:52:31+05:30 IST