రైతాంగాన్ని కేంద్రం అవమానిస్తోంది..

ABN , First Publish Date - 2021-12-31T20:11:41+05:30 IST

తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల ను కేంద్రం అవమానిస్తోందని మాజీ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్‌ అన్నారు.

రైతాంగాన్ని కేంద్రం అవమానిస్తోంది..

మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌

గూడూరురూరల్‌, డిసెంబరు 30: తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల ను కేంద్రం అవమానిస్తోందని మాజీ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్‌ అన్నారు. గూడూరు మండల కేంద్రంలో జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు ఖా సీం స్వగృహంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్‌ మాట్లాడుతూ తెలంగాణ రైతులు దేశ రైతులు కాదా అని ప్రశ్నించారు.  ఎన్నికలకు ముందు ప్రఽధాని ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చడంలో విఫలం చెందారని ఆరోపించా రు.  ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎమ్డీ.ఖాసీం, నాయకులు కటార్‌సింగ్‌, భూక్య సురేష్‌, రహీం, సాగర్‌రావు, ఉమ్లానాయక్‌, చీదురు వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T20:11:41+05:30 IST