మరియమ్మ లాకప్‌డెత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-06-24T09:30:38+05:30 IST
అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌కు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి.
డీజీపీకి ఉత్తమ్, భట్టి, సీతక్క వినతి
హైదరాబాద్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌కు బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యే సీతక్కలు డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మరియమ్మ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని.. నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పని చేస్తూ ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు, అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.