పట్టుబడిన వాహనాలను తీసుకెళ్లండి
ABN , First Publish Date - 2021-08-11T04:02:17+05:30 IST
పట్టుబడిన వాహనాలను తీసుకెళ్లండి
వరంగల్ సీపీ తరుణ్ జోషి
వరంగల్ అర్బన్ క్రైం, ఆగస్టు 10: వివిధ కేసుల్లో పట్టుబడి క్లైమ్ చేయని వాహనాలను వాహన పత్రాలు చూపించి తీసుకెళ్లాలని వరంగల్ సీపీ తరుణ్ జోషి ఒక ప్రకటనలో సూచించారు. వ్యక్తులుగానీ, రుణ సంస్థలు గానీ క్లైమ్ చేయని 490 వివిధ రకాల వాహనాలు పోలీసుల ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. ఈ వాహనాలు కమిషనరేట్ పరిధిలోని మడికొండ పోలీసు శిక్షణ కేంద్రం, జనగామ ఏసీపీ కార్యాలయంలో భద్రపరిచామని తెలిపారు. 2015 పోలీసు యాక్ట్ అనుసరించి బహిరంగ వేలం వేసేందుకు పోలీసు అధికారులు నిర్ణయించారని, వాహనదారులు ఇది గుర్తించాలని కోరారు. వాహనదారులు, రుణ సంస్థలు బహిరంగ వేలం ప్రకటన చేసిన తర్వాత ఆరుమాసాల వరకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాహనపత్రాలను జతపరిచి కమిషనరేట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం సీసీఆర్‌బీ ఏసీపీ ప్రతా్‌పకుమార్ 94910 89116 సెల్ నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.