కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ
ABN , First Publish Date - 2021-12-19T22:05:07+05:30 IST
కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ ఆదివారం లేఖ రాశారు.
హైదరాబాద్: కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ ఆదివారం లేఖ రాశారు. కల్వకుర్తి ఎత్తిపోతల విషయంలో 2 అంశాలను ఒకటిగా పొందుపరచాలని కోరారు. గెజిట్‌లో 25 నుంచి 40 టీఎంసీలు పెంచినట్లు చూపడం తప్పని లేఖలో వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయకట్టు పెంచినా.. నీటి కేటాయింపులు పెంచలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆయకట్టును పెంచలేదన్నారు. ఆయకట్టు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను లేఖకు జతచేశారు. శ్రీశైలంలో 800 అడుగుల నుంచి నీటిని తీసుకునేలా డీపీఆర్‌లో ఉందని ఈఎన్‌సీ మురళీధర్ స్పష్టం చేశారు. ఏపీలోని జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, టీజీపీ రిపోర్టులు ట్రైబ్యునల్‌కు ఇచ్చినట్లు ఈఎన్‌సీ మురళీధర్ లేఖలో తెలిపారు.