ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఘనంగా జయశంకర్ 87వ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-08-06T21:45:20+05:30 IST

లంగాణ సిద్ధాంత కర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, బిబి పాటిల్, ఎమ్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య

ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఘనంగా జయశంకర్ 87వ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ: తెలంగాణ సిద్ధాంత కర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, బిబి పాటిల్, ఎమ్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విసి ప్రొ. సీతారామరావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి ఎంపీలు, ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఎంపి డా, బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనితర కృషి చేసిన వ్యక్తి ప్రొ, జయశంకర్ సార్ అని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాల పై ఆయన ఎలుగెత్తి పోరాడారని అన్నారు.


సాధించుకునే తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలన్నవిషయంలో ఒక విజన్ కలిగిన వ్యక్తి అన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రో, జయశంకర్ సార్ పోరాడారు. ఆయన ఆశించినట్లుగానే తెలంగాణలో గడచిన 7ఏళ్లుగా పాలన సాగుతోందన్నారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో జయశంకర్ సార్ ని  గుర్తు చేసుకున్నారని చెప్పారు. సిద్దించిన తెలంగాణా ను ఆయన చూడలేదని సీఎం బాధ పడుతూ ఉంటారని పేర్కొన్నారు. జయశంకర్ సార్ ఆలోచన విధానంలోనే తెలంగాణ పథకాలు ఉన్నాయని చెప్పారు.ఇంకా కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, బిబి పాటిల్, వెంకటేష్ నేత, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తదితరులు మాట్లాడారు.

Updated Date - 2021-08-06T21:45:20+05:30 IST