జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపిక
ABN , First Publish Date - 2021-08-18T23:05:46+05:30 IST
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపిక
ఢిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 44 మంది ఎంపిక అవగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసిఫాబాద్ జిల్లా సావర్‌ఖేడ్ హెచ్‌ఎం రంగయ్య, సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్‌ఎస్ హెచ్ఎం రామస్వామి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్(జిల్లా పరిషత్ హై స్కూల్,లింగరాజు పాలెం,ఎస్ రాయవరం,విశాఖపట్నం) నుంచి ఎంపికయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్.మునిరెడ్డి జెడ్పీ హైస్కూల్ చిత్తూరు నుంచి ఎంపికయ్యారు.