కాళీగా భద్రకాళి అమ్మవారు

ABN , First Publish Date - 2021-07-12T04:26:03+05:30 IST

కాళీగా భద్రకాళి అమ్మవారు

కాళీగా భద్రకాళి అమ్మవారు

రెండో రోజు శాకంబరీ ఉత్సవాలు


వరంగల్‌ కల్చరల్‌, జూలై 11 : వరంగల్‌ భద్రకాళి దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం అమ్మవారిని తిథి ధ్వయం కారణంగా  దశమహా విద్యలోని నిత్నానుష్టానం అనుసరించి అమ్మవారిని కాళీగానే అలంకరించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణ్‌ రెడ్డి దంపతులు, హైదరాబాద్‌ అడిషనల్‌ జడ్జి కనకదుర్గ, టీఎ్‌సపీఎస్సీ సభ్యుడు కారం రవీందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ పరిటాల సుబ్బారావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-07-12T04:26:03+05:30 IST