వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
ABN , First Publish Date - 2021-01-07T04:53:17+05:30 IST
వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
ప్రణాళికాబద్ధంగా నేరాలను అదుపు చేయాలి
వరంగల్ నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి
ములుగు, జనవరి 6: నేరం జరిగిన తర్వాత స్పందించేకంటే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా నేరాలను అదుపు చేయాలని వరంగల్ నార్త్‌జోన్ ఐజీ వై.నాగిరెడ్డి అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా ములుగు పోలీ్‌సస్టేషన్‌ను ఆయన బుధవారం సాయంత్రం సందర్శించారు. సిబ్బంది చేత గౌరవ వందనం స్వీకరించి కమాండ్ కంట్రోల్ రూమ్, జిమ్, టెన్నిస్ కోర్టు, విశ్రాంతి గదు ల సముదాయాన్ని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేసి పోలీ్‌సస్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రిసెప్షన్ పనితీరు, డయల్ 100 నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ నేరాలు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి.. వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే విషయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. టెక్నాలజీ సహాయంతో నేర దర్యాప్తులో పురోగతిని సాధించి తెలంగాణ పోలీసు శాఖ విప్లవాత్మక ముందడుగు వేసిందని ఐజీ అన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ క్రైమ్ ల్యాబ్ విభాగాలను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తూ బాధితులకు అండగా ఉంటున్నామని, ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా జవాబుదారీగా ఉండేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏఎస్పీ పి.సాయిచైతన్య, గణపురం ఎస్‌హెచ్‌వో సుధీర్ కేకన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సి.హెచ్.కుమారస్వామి, సీఐ కె.దేవేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు హరికృష్ణ, ఫణి పాల్గొన్నారు.