కోడ్‌బళె
ABN , First Publish Date - 2021-04-08T17:55:11+05:30 IST
వరి పిండి - అర కప్పు, బొంబాయి రవ్వ- పావు కప్పు, మైదా పిండి- అర కప్పు, వాము, జీలకర్ర- అర స్పూను, కొబ్బరి (ఎండు లేదా పచ్చిది)- పావు కప్పు, ఎండు మిర్చి- పది, నీరు, ఉప్పు, నూనె- తగినంత.
కావలసిన పదార్థాలు: వరి పిండి - అర కప్పు, బొంబాయి రవ్వ- పావు కప్పు, మైదా పిండి- అర కప్పు, వాము, జీలకర్ర- అర స్పూను, కొబ్బరి (ఎండు లేదా పచ్చిది)- పావు కప్పు, ఎండు మిర్చి- పది, నీరు, ఉప్పు, నూనె- తగినంత.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో వరి పిండి, రవ్వ, మైదా కలుపుకోవాలి. దీనికి వాము, ఉప్పు కూడా జత చెయ్యాలి. రెండు స్పూన్ల వేడి నూనె వేసి బాగా కలపాలి. కొబ్బరి, జీలకర్ర, మిర్చిని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని కూడా గిన్నెలోని పిండిలో కలిపి తగినంత నీటితో ముద్దలా చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా పిండిని తీసుకుని రింగులుగా చుట్టుకోవాలి. కడాయిలో నూనె మరిగాక ఈ రింగుల్ని ఎర్రగా వేయించి తీస్తే కర్ణాటకలో అత్యంత ప్రసిద్ధ చిరుతిండి వంటకం కోడ్‌బళె సిద్ధం.