అనోకీ ఖీర్
ABN , First Publish Date - 2021-08-22T18:44:47+05:30 IST
తెల్ల ఉల్లిపాయలు - 500గ్రా, పాలు - ఒక లీటరు, పంచదార - 150గ్రా, యాలకులు - 10గ్రా, పిస్తా - 10గ్రా, వెనిగర్ - కొద్దిగా.
కావలసినవి: తెల్ల ఉల్లిపాయలు - 500గ్రా, పాలు - ఒక లీటరు, పంచదార - 150గ్రా, యాలకులు - 10గ్రా, పిస్తా - 10గ్రా, వెనిగర్ - కొద్దిగా.
తయారీ విధానం: ఉల్లిపాయలను సన్నగా తరిగి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి నీళ్లుపోసి ఉల్లిపాయలు, వెనిగర్ వేసి ఉడికించాలి. తరువాత చల్లటి నీటిలో ఉల్లిపాయలు మరోసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై మరొక పాత్రలో పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో పంచదార వేసి మరికాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. యాలకులను పొడి చేసి వేసుకోవాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. పిస్తాపలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.