ఆపిల్ హల్వా
ABN , First Publish Date - 2021-07-29T18:59:41+05:30 IST
ఆపిల్స్- నాలుగు, నెయ్యి- నాలుగు స్పూన్లు, జీడిపప్పు పలుకులు- 8, చక్కెర- పావు కప్పు, కేసరి రంగు, యాలకుల పొడి- పావు స్పూను, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్- స్పూను
కావలసిన పదార్థాలు: ఆపిల్స్- నాలుగు, నెయ్యి- నాలుగు స్పూన్లు, జీడిపప్పు పలుకులు- 8, చక్కెర- పావు కప్పు, కేసరి రంగు, యాలకుల పొడి- పావు స్పూను, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్- స్పూను.
తయారుచేసే విధానం: ఆపిల్‌ను తురుముకోవాలి. ఓ పాన్‌లో నెయ్యి వేసి, జీడిపలుకులను వేయించి పక్కన పెట్టాలి. మిగతా నెయ్యిలో ఆపిల్‌ను తురుమును వేసి మెత్తగా అయ్యేవరకు వేయించాలి. ఆ తరవాత చక్కెర, కేసరి వేసి బాగా కలపాలి. చక్కెరంతా కరిగి హల్వా అంతా దగ్గరయ్యాక వెనీలా ఎక్స్‌ట్రాక్ట్, యాలకుల పొడి, జీడిపుప్పు పలుకులు కలిపితే ఆపిల్ హల్వా రెడీ.