కొబ్బరి హల్వా

ABN , First Publish Date - 2021-10-30T18:43:21+05:30 IST

కొబ్బరికాయ ముక్కలు - నాలుగు, పాలు - అర లీటరు, కోవా - 100గ్రాములు, నెయ్యి - 30గ్రాములు, పంచదార - 150గ్రాములు, బాదం - 10గ్రాములు, పిస్తా - 10గ్రాములు, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌.

కొబ్బరి హల్వా

కావలసినవి: కొబ్బరికాయ ముక్కలు - నాలుగు, పాలు - అర లీటరు, కోవా - 100గ్రాములు, నెయ్యి - 30గ్రాములు, పంచదార - 150గ్రాములు, బాదం - 10గ్రాములు, పిస్తా - 10గ్రాములు, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక కొబ్బరి తురుము వేసి వేగించాలి. తరువాత పాలు, పంచదార, కోవా వేసి మరికాసేపు వేగించుకోవాలి. కొన్ని బాదం పలుకులు, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. చివరగా మిగిలిన బాదం, పిస్తా పలుకులతో గార్నిష్‌ చేస్తే కొబ్బరి హల్వా రెడీ.

Updated Date - 2021-10-30T18:43:21+05:30 IST