డబల్‌ కా మీఠా

ABN , First Publish Date - 2021-08-22T19:26:46+05:30 IST

సోదరులకు రాఖీ కట్టి స్వీటుతో నోరు తీపి చేయడం సంప్రదాయం. అలాగని కొనుగోలు చేసిన స్వీటుతో కాకుండా మీరు ఇంట్లో తయారుచేసిన స్వీటుతో నోరు తీపి చేస్తే ఆ అనుభూతే వేరు. డబల్‌ కా మీఠా, అప్రికాట్‌ పుడ్డింగ్‌, కద్దు కా హల్వా, అనోకీ ఖీర్‌ వంటి వాటితో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోండి.

డబల్‌ కా మీఠా

సోదరునికి స్వీటుతో

సోదరులకు రాఖీ కట్టి స్వీటుతో నోరు తీపి చేయడం సంప్రదాయం. అలాగని కొనుగోలు చేసిన స్వీటుతో కాకుండా మీరు ఇంట్లో తయారుచేసిన స్వీటుతో నోరు తీపి చేస్తే ఆ అనుభూతే వేరు. డబల్‌ కా మీఠా, అప్రికాట్‌ పుడ్డింగ్‌, కద్దు కా హల్వా, అనోకీ ఖీర్‌ వంటి వాటితో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోండి. 


కావలసినవి: జంబో బ్రెడ్‌ - 8 స్లైస్‌లు, పంచదార - 200గ్రా, వనస్పతి - 500గ్రా, కోవా - 100గ్రా, యాలకులు - 10గ్రా.


తయారీ విధానం: ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌ను నాలుగు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి వనస్పతి  వేసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలు వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. తరువాత స్టవ్‌పై మరొక కడాయి పెట్టి పంచదార, నీళ్లు పోసి పంచదార పానకం తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఆ పానకంలో ఫ్రై చేసిన బ్రెడ్‌ ముక్కలు వేయాలి. చివరగా కోవా, యాలకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-08-22T19:26:46+05:30 IST