గాజర్ హల్వా
ABN , First Publish Date - 2021-03-12T18:25:26+05:30 IST
క్యారట్ (చెక్కుతీసిన తురుము): నాలుగు కప్పులు, పాలు: నాలుగు కప్పులు, నెయ్యి: నాలుగు స్పూన్లు, చక్కెర: రెండు కప్పులు, బాదం, జీడిపప్పు ముక్కలు: పది, యాలకుల పొడి, కుంకుమ పువ్వు: చిటికెడు
కావలసిన పదార్థాలు: క్యారట్ (చెక్కుతీసిన తురుము): నాలుగు కప్పులు, పాలు: నాలుగు కప్పులు, నెయ్యి: నాలుగు స్పూన్లు, చక్కెర: రెండు కప్పులు, బాదం, జీడిపప్పు ముక్కలు: పది, యాలకుల పొడి, కుంకుమ పువ్వు: చిటికెడు
తయారుచేసే విధానం: ఓ పాన్‌లో క్యారట్ తురుము, పాలను కలపాలి. తక్కువ మంట మీద ఉడికేలా చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముప్పావు భాగం పాలు ఇంకినట్టుగా అన్పించినప్పుడు నెయ్యి, చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. పాలు ఇంకిపోయి క్యారట్ పూర్తిగా మగ్గేవరకు కలుపుతూనే ఉండాలి. ఆ తరవాత బాదం, జీడిపప్పు, కుంకుమ పువ్వు కూడా వేసి కలిపి ఓ రెండు నిమిషాల తరవాత స్టవ్ ఆపేయాలి. ఈ హల్వాని వేడివేడిగా లేకపోతే ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్ల చల్లగా తిన్నా భలే రుచిగా ఉంటుంది.