ఇన్‌స్టంట్ జిలేబీ
ABN , First Publish Date - 2021-10-13T17:16:57+05:30 IST
మైదా - అరకప్పు, మొక్క జొన్న పొడి- స్పూను, వెనిగర్- అర స్పూను, పెరుగు- స్పూను, పసుపు- చిటికెడు, చక్కెర- కప్పు, యాలకుల పొడి- పావు స్పూను, నూనె, నీళ్లు- తగినంత, నెయ్యి- స్పూను.
కావలసిన పదార్థాలు: మైదా - అరకప్పు, మొక్క జొన్న పొడి- స్పూను, వెనిగర్- అర స్పూను, పెరుగు- స్పూను, పసుపు- చిటికెడు, చక్కెర- కప్పు, యాలకుల పొడి- పావు స్పూను, నూనె, నీళ్లు- తగినంత, నెయ్యి- స్పూను.
తయారుచేసే విధానం: మొదట చక్కెర పాకాన్ని చేసి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో మైదా, మొక్క జొన్న పొడి, పెరుగు బాగా కలపాలి, వెనిగర్‌ను కూడా జతచేయాలి. అవసరమైతే తగినంత నీటితో పిండిని జారుగా కలుపుకోవాలి. ఖాళీ అయిన కెచప్ సీసాలో ఈ పిండిని వేసి మూతపెట్టాలి. బాణలిలో నూనె కాగాక సీసానుంచి జిలేబీలను చుట్టాలి. బంగారు రంగులోకి మారాక చక్కెర పాకంలో వేసి కాసేపు నానబెడితే జిలేబీలు సిద్ధం.