ఇన్‌స్టెంట్‌ కలాఖండ్‌

ABN , First Publish Date - 2021-07-15T18:26:07+05:30 IST

పనీర్‌ తురుము- రెండున్నర కప్పులు, పాల పొడి- ఒకటిన్నర కప్పు, తాజా మీగడ - ఒకటిన్నర కప్పు, చక్కెర- మూడు కప్పులు, యాలకుల పొడి- అర స్పూను, బాదం, పిస్తా తురుము - స్పూను.

ఇన్‌స్టెంట్‌ కలాఖండ్‌

కావలసిన పదార్థాలు: పనీర్‌ తురుము- రెండున్నర కప్పులు, పాల పొడి- ఒకటిన్నర కప్పు, తాజా మీగడ - ఒకటిన్నర కప్పు, చక్కెర- మూడు కప్పులు, యాలకుల పొడి- అర స్పూను, బాదం, పిస్తా తురుము - స్పూను.


తయారుచేసే విధానం: లోతు, మందం ఉన్న బాణలిలో యాలకుల పొడి మినహా మిగతా పదార్థాలన్నిటినీ వేసి బాగా కలిపి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మిశ్రమం ముద్దగా మారుతున్నప్పుడు స్టవ్‌ కట్టేసి యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నెయ్యి రాసిన పళ్లెంలోకి మిశ్రమాన్ని వేసి బాదం, పిస్తా తురుముతో అలంకరిస్తే ఇన్‌స్టెంట్‌ కలాఖండ్‌ రెడీ. వేడిగా ఉన్నప్పుడే చాకుతో ముక్కలుగా కట్‌ చేస్తే మంచిది.

Updated Date - 2021-07-15T18:26:07+05:30 IST