ఖీర్‌

ABN , First Publish Date - 2021-03-20T18:05:42+05:30 IST

స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో సగ్గుబియ్యం వేయాలి. పావుగంట పాటు ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపాలి. నీళ్లు తీసేసి సగ్గుబియ్యం పక్కన పెట్టుకోవాలి. ఖర్బూజ గింజలు

ఖీర్‌

కావలసినవి: సగ్గుబియ్యం - ఐదు టేబుల్‌స్పూన్లు, ఖర్బూజ - ఒక కేజీ, పంచదార - అర కప్పు, కొబ్బరిపాలు - పావు కప్పు.


తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాత్రను పెట్టి కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో సగ్గుబియ్యం వేయాలి. పావుగంట పాటు ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపాలి. నీళ్లు తీసేసి సగ్గుబియ్యం పక్కన పెట్టుకోవాలి. ఖర్బూజ గింజలు తీసేసి ముక్కలుగా కట్‌ చేయాలి. మిక్సీలో వేసి మెత్తగా పట్టుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార, కొబ్బరిపాలు, ఉడికించిన సగ్గుబియ్యం వేసి కలపాలి. ఫ్రిజ్‌లో అరగంటపాటు పెట్టి తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-03-20T18:05:42+05:30 IST