కివి లెమనేడ్‌ స్ర్పిట్జర్‌

ABN , First Publish Date - 2021-03-27T17:30:15+05:30 IST

చల్లదనంతో పాటు కొత్త రుచి కోసం కివి లెమనేడ్‌ స్ర్పిట్జర్‌ సమ్మర్‌ డ్రింక్‌ తాగిచూడండి.

కివి లెమనేడ్‌ స్ర్పిట్జర్‌

ఆంధ్రజ్యోతి(27-03-2021)

చల్లదనంతో పాటు కొత్త రుచి కోసం కివి లెమనేడ్‌ స్ర్పిట్జర్‌ సమ్మర్‌ డ్రింక్‌ తాగిచూడండి. 


కావలసినవి: చక్కెర నాలుగు కప్పులు, కివి పండ్లు- ఆరు, నిమ్మరసం - రెండు కప్పులు, నీళ్లు - ఒక కప్పు, కార్బొనేటెడ్‌ వాటర్‌ ఒక లీటర్‌, కివి, నిమ్మకాయ ముక్కలు నాలుగైదు అలంకరణ కోసం.


తయారీ: మిక్సీలో కివి పండ్లు, చక్కెర వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నిమ్మరసం, నీళ్లు పోసి కలపాలి. తరువాత అందులో కివి పేస్ట్‌ వేసి బాగా కలపాలి. అంతే కివి లెమనేడ్‌ స్ర్పిట్జర్‌ రెడీ. ఈ డ్రింక్‌ను గ్లాసుల్లో ఐస్‌క్యూబ్స్‌, కార్బొనేట్‌డ్‌ వాటర్‌ వేసి చల్లగా అందించాలి. 

Updated Date - 2021-03-27T17:30:15+05:30 IST