మ్యాంగో తిరమిసు

ABN , First Publish Date - 2021-06-19T17:21:30+05:30 IST

మామిడిపండు ఎవర్‌గ్రీన్‌. వాటితో చేసే ఏ రెసిపీ అయినా నోరూరేలా చేస్తుంది. కోయడానికి అనువుగా ఉన్న మామిడిపండుతో ఫిర్ని, తిరమసు, కుల్ఫీ, అమరఖంద్‌ వంటి రెసిపీలను ట్రై చేస్తే జిహ్వచాపల్యం తీరుతుంది. ఆ రెసిపీల విశేషాలు ఇవి...

మ్యాంగో తిరమిసు

మామిడితో మహా మజా

మామిడిపండు ఎవర్‌గ్రీన్‌. వాటితో చేసే ఏ రెసిపీ అయినా నోరూరేలా చేస్తుంది. కోయడానికి అనువుగా ఉన్న మామిడిపండుతో ఫిర్ని, తిరమసు, కుల్ఫీ, అమరఖంద్‌ వంటి రెసిపీలను ట్రై చేస్తే జిహ్వచాపల్యం తీరుతుంది. ఆ రెసిపీల విశేషాలు ఇవి...


వందగ్రాముల మామిడిపండులో పోషకాలు...

క్యాలరీలు 60

కార్బోహైడ్రేట్లు 15గ్రా

ప్రోటీన్లు 0.8గ్రా

మామిడిపండులో ఫ్యాట్‌, సోడియం, కొలెస్ట్రాల్‌ ఉండదు.

విటమిన్లు, లవణాలు 20 రకాల వరకు ఉంటాయి.

విటమిన్‌ -సి, విటమిన్‌ - ఎ, విటమిన్‌ -బి6 పుష్కలంగా లభిస్తాయి. 

ఈ పండు తింటే ఫోలేట్‌, కాపర్‌, తగినంత ఫైబర్‌ అందుతాయి.


కావలసినవి: మాస్కార్‌పోన్‌ ఛీజ్‌ - 100గ్రా, విప్‌ క్రీమ్‌ - 75 గ్రా, కోడిగుడ్డు పచ్చసొన - మూడు, చాక్లెట్‌ స్పాంజ్‌ - 100గ్రా, పంచదార పొడి - 50గ్రా, కోకో పౌడర్‌ - 10గ్రా, మామిడిపండ్లు - రెండు, కాఫీ లిక్కర్‌ - 25ఎంఎల్‌.


తయారీ విధానం: ఒక పాత్రలో మాస్కార్‌పోన్‌ ఛీజ్‌, క్రీమ్‌ను తీసుకుని బాగా కలిపి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. క్రీమ్‌, మామిడిపండు గుజ్జు కలుపుకోవాలి. చాక్లెట్‌ స్పాంజ్‌ను గ్లాసు సైజును బట్టి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత కాఫీ లిక్కర్‌, పంచదార పానకం పోయాలి. మాస్కార్‌పోన్‌ ఛీజ్‌ లేయర్‌, మ్యాంగో క్రీమ్‌ లేయర్‌ వేసుకోవాలి. రెండు, మూడు లేయర్లుగా వేసి ఫ్రిజ్‌లో రెండు గంటలు పెట్టాలి. కోకో పౌడర్‌, మామిడిపండు ముక్కలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయాలి.


Updated Date - 2021-06-19T17:21:30+05:30 IST