ఖర్బూజ ఐస్‌క్రీమ్
ABN , First Publish Date - 2021-03-20T19:39:12+05:30 IST
వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లో ఎక్కడ చూసినా ఖర్బూజా కనిపిస్తుంటుంది. ఒంటికి చలువనివ్వడంతో పాటు ఎన్నో పోషక విలువలు కలిగిన ఖర్బూజాతో జ్యూస్ ఒక్కటే కాదు మిల్క్‌షేక్, ఖీర్, ఐస్‌క్రీమ్, సలాడ్, బర్ఫీ వంటివి చేసుకోవచ్చు. ఇంకెందుకాలస్యం ఈ వారం ఖర్బూజా రెసిపీలతో కూల్ అయిపోండి.
ఖర్బూజతో కూల్‌గా..

కావలసినవి: ఖర్బూజ - ఒకటి చిన్నది, క్రీమ్ తీయని పాలు - ఒక లీటరు, కార్న్‌ఫ్లోర్ - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - ముప్పావు కప్పు, వెనీలా ఎసెన్స్ - రెండు చుక్కలు, క్రీమ్ - ఒక కప్పు.
తయారీ విధానం: లీటరు పాలలో నుంచి పావు కప్పు పాలు తీసి పక్కన పెట్టాలి. మిగిలిన పాలను స్టవ్‌పై పావుగంట పాటు మరిగించాలి. పక్కన పెట్టుకున్న పావు కప్పు పాలలో కార్న్‌ఫ్లోర్ వేయాలి. తరువాత మరుగుతున్న పాలలో వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై మూడు, నాలుగు నిమిషాల పాటు ఉండనివ్వాలి. స్టవ్‌పై నుంచి దింపి వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. చల్లారిన తరువాత అల్యూమినియం టిన్‌లోకి మార్చి ఫ్రిజ్‌లో మూడు గంటల పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి, క్రీమ్ వేసి మళ్లీ మెత్తగా అయ్యేలా బ్లెండ్ చేయాలి. తిరిగి అదే అల్యూమినియం టిన్‌లో వేసి ఐదారు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. చల్లటి ఐస్‌క్రీమ్‌ను బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేయాలి.