పంజాబీ లస్సీ
ABN , First Publish Date - 2021-04-03T19:14:09+05:30 IST
పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - పావు టీస్పూన్, ఐస్‌క్యూబ్స్ - కొన్ని, చల్లటి నీళ్లు - రెండు గ్లాసులు.
ఇంట్లో సులభంగా తయారుచేసుకునే సమ్మర్ డ్రింక్ ఇది. శరీరానికి చలువ చేసే ఈ పానీయం తయారీ చూద్దాం...
కావలసినవి: పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - పావు టీస్పూన్, ఐస్‌క్యూబ్స్ - కొన్ని, చల్లటి నీళ్లు - రెండు గ్లాసులు.
తయారీ విధానం: పెరుగును మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. తరువాత పంచదార, కుంకుమపువ్వు రేకులు, యాలకుల పొడి వేయాలి. ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. చల్లటి నీళ్లు కలపాలి. మరొక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. గ్లాసుల్లో పోసుకుని సర్వ్ చేయాలి.