రబ్డీ

ABN , First Publish Date - 2021-10-02T18:30:09+05:30 IST

ఈ సీజన్‌లో అందరూ ఇష్టపడేది సీతాఫలాలనే. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోన్న సీతాఫలాలతో నోరూరించే రెసిపీలు తయారుచేసుకోవచ్చు. రోజూ నేరుగా తినడం కన్నా వాటితో బాసుందీ, రబ్డీ, కలాకంద్‌, ఖీర్‌, ఐస్‌క్రీమ్‌లు తయారుచేసి ఆస్వాదిస్తే జిహ్వ చాపల్యం తీరుతుంది

రబ్డీ

ఆహా..! స్వీటాఫలం!

ఈ సీజన్‌లో అందరూ ఇష్టపడేది సీతాఫలాలనే. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తోన్న సీతాఫలాలతో నోరూరించే రెసిపీలు తయారుచేసుకోవచ్చు. రోజూ నేరుగా తినడం కన్నా వాటితో బాసుందీ, రబ్డీ, కలాకంద్‌, ఖీర్‌, ఐస్‌క్రీమ్‌లు తయారుచేసి ఆస్వాదిస్తే జిహ్వ చాపల్యం తీరుతుంది. కొత్త రుచులను ఆస్వాదించినట్టు అవుతుంది. 


కావలసినవి: ఫ్యాట్‌ తీయని పాలు - ఒకటిన్నర లీటరు, సీతాఫలాలు - మూడు, బాదం - పావు కప్పు, పిస్తా - పావుకప్పు, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా సీతాఫలాల విత్తనాలు తీసేసి గుజ్జుగా చేసి ఒక బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలు తీసుకుని స్టవ్‌పై పెట్టి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో యాలకుల పొడి వేసి చిన్న మంటపై పెట్టాలి. పాలపై మీగడ తయారయ్యాక ఒక చెంచాతో దాన్ని తీసి ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. మళ్లీ పాలు మరిగించుకోవాలి. మరోసారి మీగడ తయారయ్యాక చెంచాతో తీసి బౌల్‌లోకి వేసుకోవాలి. అలా నాలుగైదు సార్లు మీగడ తీయాలి. తరువాత పాలు దింపి పక్కన పెట్టాలి. మీగడ ఉన్న బౌల్‌లో సీతాఫలం గుజ్జు, బాదం పలుకులు, పిస్తా వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-10-02T18:30:09+05:30 IST