థాండై

ABN , First Publish Date - 2021-03-27T17:33:40+05:30 IST

బాదం పలుకులు - పావు కప్పు, జీడిపప్పు - ఐదారు పలుకులు, పుచ్చకాయ గింజలు - రెండు టేబుల్‌స్పూన్లు, గసగసాలు - ఒక టేబుల్‌స్పూన్‌, సోంపు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు - ఐదు, మిరియాలు - నాలుగైదు, పంచదార - రుచికి తగినంత, పాలు

థాండై

కావలసినవి: బాదం పలుకులు - పావు కప్పు, జీడిపప్పు - ఐదారు పలుకులు, పుచ్చకాయ గింజలు - రెండు టేబుల్‌స్పూన్లు, గసగసాలు - ఒక టేబుల్‌స్పూన్‌, సోంపు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు - ఐదు, మిరియాలు - నాలుగైదు, పంచదార - రుచికి తగినంత, పాలు - ఒక లీటరు, నీళ్లు - పావు కప్పు, రోజ్‌ ఎసెన్స్‌ - కొద్దిగా, కుంకుమపువ్వు - కొద్దిగా.


తయారీ విధానం: బాదం పలుకులు, పుచ్చకాయ గింజలు, గసగసాలను రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి పాలు పోసి మరిగించాలి. పంచదార వేయాలి. పంచదార కరిగిన తరువాత స్టవ్‌ పై నుంచి దింపాలి. నానబెట్టిన బాదం పలుకుల పొట్టు తీయాలి. పుచ్చకాయ గింజ లు, గసగసాలలో ఉన్న నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో బాదం పలుకులు, పుచ్చకాయ గింజలు, గసగసాలు, జీడిపప్పు, మిరియాలు, యాలకులు, సోంపు వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని పాలు-పంచదార మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత పావుగంట పాటు పక్కన పెట్టాలి. తరువాత కుంకుమ పువ్వు, రోజ్‌ ఎసెన్స్‌ వేసి కలియబెట్టుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లటి థాండై సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-03-27T17:33:40+05:30 IST