వాలంటైన్‌ స్మూతీ

ABN , First Publish Date - 2021-02-13T19:41:17+05:30 IST

బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ ఇడ్లీ, వడ, దోశ అంటే ఎవరికైనా బోర్‌ కొడుతుంది. అందుకే కాస్త భిన్నంగా స్మూతీలు ట్రై చేయండి. పోషకాలు పుష్కలంగా లభించే స్మూతీలు జిహ్వ చాపల్యాన్ని కూడా తీరుస్తాయి.అలాంటి టేస్టీ స్మూతీలు కొన్ని...

వాలంటైన్‌ స్మూతీ

సూపర్‌ స్మూతీలు!

బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ ఇడ్లీ, వడ, దోశ అంటే ఎవరికైనా బోర్‌ కొడుతుంది. అందుకే కాస్త భిన్నంగా స్మూతీలు ట్రై చేయండి. పోషకాలు పుష్కలంగా లభించే స్మూతీలు  జిహ్వ చాపల్యాన్ని కూడా తీరుస్తాయి.అలాంటి టేస్టీ స్మూతీలు కొన్ని...

కావలసినవి: సోయా మిల్క్‌ - రెండు కప్పులు(చల్లగా ఉండాలి), రాస్‌బెర్రీలు - ఒక కప్పు, అంజీర్‌ - రెండు, జీడిపప్పు - అరకప్పు, కొకొవా పౌడర్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, మాకా పౌడర్‌ - ఒక టీస్పూన్‌, తియ్యటి మిరపపొడి - అర టీస్పూన్‌, మాపుల్‌ సిరప్‌ - ఒక టేబుల్‌స్పూన్‌.

తయారీ విధానం: మిక్సీలో పదార్థాలన్నింటినీ వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. కొకొవా పౌడర్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-02-13T19:41:17+05:30 IST