గోధుమ లడ్డు
ABN , First Publish Date - 2021-08-05T18:07:53+05:30 IST
గోధుమ పిండి- కప్పు, చక్కెర- అర కప్పు, నెయ్యి- పావు కప్పు, బాదం - 15, జీడిపప్పు - 15, యాలకుల పొడి- ఒక స్పూను, ఎండు ద్రాక్ష- రెండు స్పూన్లు.
కావలసిన పదార్థ్థాలు: గోధుమ పిండి- కప్పు, చక్కెర- అర కప్పు, నెయ్యి- పావు కప్పు, బాదం - 15, జీడిపప్పు - 15, యాలకుల పొడి- ఒక స్పూను, ఎండు ద్రాక్ష- రెండు స్పూన్లు.
తయారుచేసే విధానం: చక్కెర పొడి చేసి పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యివేసి జీడిపప్పు, బాదం దోరగా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. అదే బాణలిలో నెయ్యి వేసి గోధుమ పిండిని వేయించాలి. వేగాక కమ్మని వాసన వస్తుంది. అప్పుడు దాన్ని ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. అందులో చక్కెర పొడి, బాదం, జీడిపప్పు మిశ్రమం, యాలకుల పొడి, ఎండు ద్రాక్ష వేసి లడ్డూ కడితే సరి.