చక్నా
ABN , First Publish Date - 2021-07-17T17:51:15+05:30 IST
గొర్రె మాంసం - 200గ్రా (ల్యాంబ్ చాప్స్), గొర్రె కిడ్నీలు - 100గ్రా, గొర్రె కాలేయం - 100గ్రా, గొర్రె నాలుక - రెండు, బోన్‌లెస్ చికెన్ - 200గ్రా, ఉల్లిపాయలు - రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, కారం - ఒక టీస్పూన్, పసుపు - అర టీస్పూన్, పచ్చిమిర్చి - మూడు
కావలసినవి: గొర్రె మాంసం - 200గ్రా (ల్యాంబ్ చాప్స్), గొర్రె కిడ్నీలు - 100గ్రా, గొర్రె కాలేయం - 100గ్రా, గొర్రె నాలుక - రెండు, బోన్‌లెస్ చికెన్ - 200గ్రా, ఉల్లిపాయలు - రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్, కారం - ఒక టీస్పూన్, పసుపు - అర టీస్పూన్, పచ్చిమిర్చి - మూడు, కొత్తిమీర - కొద్దిగా, శనగలు - రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, పెరుగు - అర కప్పు, నూనె - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత.
తయారీ విధానం: ముందుగా గొర్రె మాంసం ఉడికించుకోవాలి. కిడ్నీలను రెండు ముక్కలుగా కట్ చేయాలి. కాలేయంను చిన్న చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. నాలుకను ఉడికించి రెండు ముక్కలుగా చేసుకోవాలి. శనగలను నెయ్యిలో వేగించి పొడి చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేగించాలి. తరువాత అందులో నుంచి కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టాలి. మిగతా ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మరికాసేపు వేగించాలి. తరువాత కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కాలేయం, కిడ్నీలు వేసి కలుపుకోవాలి. కాసేపు వేగాక పెరుగు వేయాలి. నూనె తేలేవరకు ఉడికించాలి. తరువాత చికెన్ వేసి రెండు కప్పుల నీళ్లు పోసి మరికాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మాంసం, నాలుక వేసి కలుపుకోవాలి. శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి పలుచగా చేయాలి. తరువాత గ్రేవీలో పోసి కలుపుకోవాలి. నిమ్మరసం వేయాలి. నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర, వేగించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.