ఫ్రైడ్‌ చికెన్‌

ABN , First Publish Date - 2021-04-17T17:54:22+05:30 IST

ముందుగా చికెన్‌ బ్రెస్ట్‌లను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఎగ్‌వైట్‌లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. మరొక ప్లేట్‌లో నువ్వులు తీసుకోవాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలను ఎగ్‌వైట్‌లో డిప్‌ చేసి, నువ్వులు సమంగా అంటేలా అద్దాలి. తరువాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి

ఫ్రైడ్‌ చికెన్‌

కావలసినవి: చికెన్‌ బ్రెస్ట్‌లు - ఆరు, ఎగ్‌వైట్‌ - రెండు, ఉప్పు - కొద్దిగా, నువ్వులు - అర కప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా చికెన్‌ బ్రెస్ట్‌లను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఎగ్‌వైట్‌లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. మరొక ప్లేట్‌లో నువ్వులు తీసుకోవాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలను ఎగ్‌వైట్‌లో డిప్‌ చేసి, నువ్వులు సమంగా అంటేలా అద్దాలి. తరువాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. స్టవ్‌పై డీప్‌ ఫ్రై పాన్‌ పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక చికెన్‌ ముక్కలు వేసి వేగించాలి. ఐదు నిమిషాల పాటు వేగిన తరువాత ముక్కలు మరోవైపు తిప్పి మరికాసేపు వేగించి తీసుకోవాలి. నువ్వుల చికెన్‌ బ్రెస్ట్‌లను చిల్లీ సాస్‌తో కలిపి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2021-04-17T17:54:22+05:30 IST