హనీ గార్లిక్‌ చికెన్‌!

ABN , First Publish Date - 2021-06-05T14:47:10+05:30 IST

రొటీన్‌కు భిన్నంగా తీయదనాన్ని జోడించిన చికెన్‌ రెసిపీ ఇది. స్నాక్‌గా, మెయిన్‌ కోర్స్‌ రెసిపీగా రెండు విధాలుగా వాడుకోగలిగే సింపుల్‌ చికెన్‌ రెసిపీ హనీ గార్లిక్‌ చికెన్‌!

హనీ గార్లిక్‌ చికెన్‌!

(తయారీ సమయం: 15 నిమిషాలు)

రొటీన్‌కు భిన్నంగా తీయదనాన్ని జోడించిన చికెన్‌ రెసిపీ ఇది. స్నాక్‌గా, మెయిన్‌ కోర్స్‌ రెసిపీగా రెండు విధాలుగా వాడుకోగలిగే సింపుల్‌ చికెన్‌ రెసిపీ హనీ గార్లిక్‌ చికెన్‌!


కావలసిన పదార్థాలు: ఆలివ్‌ ఆయిల్‌: రెండు టీ స్పూన్లు, బోన్‌లెస్‌ చికెన్‌: కిలో (అర అంగుళం ముక్కలు), ఉప్పు, మిరియాల పొడి: తగినంత, తేనె: 3 టేబుల్‌ స్పూన్లు, సోయా సాస్‌: 3 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్‌: ఒకటిన్నర స్పూను, మిరపకాయ విత్తనాలు: పావు టీస్పూను


తయారీ విధానం: గిన్నెలో ఆలివ్‌ ఆయిల్‌ వేడి చేసుకోవాలి. చికెన్‌ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి పట్టించాలి. తేనె, సోయా సాస్‌, వెల్లుల్లి ముద్ద, మిరపకాయ విత్తనాలు బాగా కలుపుకుని పెట్టుకోవాలి. వేడెక్కిన నూనెలో చికెన్‌ ముక్కలు వేసి, నాలుగు నిమిషాల పాటు ముక్కలు రంగు మారేవరకూ వేయించుకోవాలి. కలుపుకున్న మసాలా ముద్దను చికెన్‌లో వేసి, మసాలా ముక్కలకు పట్టేలా నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. చికెన్‌ ముక్కలు చిన్నవే కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. కాబట్టి అవసరానికి మించి ఉడికించుకోకూడదు. స్టవ్‌ నుంచి దించి, కొత్తిమీర, నువ్వులతో అలంకరించి, వేడి అన్నంతో పాటు సర్వ్‌ చేయాలి.


ఫన్‌ఫ్యాక్ట్స్‌ 

బాబిలోనియాలో గోడల మీద బయల్పడిన ఆకృతులను బట్టి, క్రీస్తుపూర్వం 600 ప్రాంతం నుంచే చికెన్‌ను వంటకంగా తినే సంప్రదాయం ఉందని ప్రపంచానికి తెలిసింది.  

ప్రపంచంలో మనుషుల కంటే కోళ్ల సంఖ్యే ఎక్కువ.

తన 70వ యానివర్సరీని పురస్కరించుకుని కెఎఫ్‌సి ఏకంగా 1131 కిలోల అతి పెద్ద ఫ్రైడ్‌ చికెన్‌ను సర్వ్‌ చేసింది. 

కోళ్లను చూస్తే కలిగే భయానికి ‘అలెక్టెరోఫోబియా’ అని పేరు.


Updated Date - 2021-06-05T14:47:10+05:30 IST